Madhira Bar Association: మున్సిపల్ ఎన్నికల వేళ మధిరలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. పట్టణ సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ అధికార కాంగ్రెస్ పార్టీకి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు మధిర బార్ అసోసియేషన్ వెల్లడించింది.
భట్టి నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యం: స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బోజెడ్ల పుల్లారావు మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నాయకత్వంలో మధిర నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. భవిష్యత్తులో పట్టణం మరింత అభివృద్ధి సాధించాలంటే మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
కోర్టు భవన నిర్మాణానికి రూ. 25 కోట్లు మంజూరు: మధిర అభివృద్ధి కోసం మేధావులంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరావు కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించేందుకు వచ్చిన మధిర అసోసియేషన్‌కి ఆయన అభినందనలు తెలిపారు. మధిర కోర్టు నిర్మాణానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రూ. 25 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు.
Read also- Municipal Elections: కీలక సర్క్యూలర్ జారీ చేసిన ఈసీ.. విప్ ధిక్కరిస్తే పదవి అవుట్!
బార్ అసోసియేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు: మధిర పురోభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రాజకీయాలకతీతంగా మేధావులంతా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మద్దతు ప్రకటించిన బార్ అసోసియేషన్ సభ్యులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో హైకోర్టు న్యాయవాది శేషగిరిరావుతో పాటు సీనియర్ న్యాయవాదులు వాసంశెట్టి కోటేశ్వరరావు, వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, కట్టా పూర్ణచందర్రావు, కావూరు రమేష్, నంబూరి జనార్దన్ రావు, నెల్లూరి రవి, తూములూరి సంధ్య, అబ్రహం, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

