Homeతెలంగాణఖమ్మంGanja Seizure: ఖమ్మంలో భారీగా గంజాయి పట్టివేత.. 15.7 కేజీల గంజాయి స్వాధీనం

Ganja Seizure: ఖమ్మంలో భారీగా గంజాయి పట్టివేత.. 15.7 కేజీల గంజాయి స్వాధీనం

ఖమ్మం (తెలుగు ప్రభ): ​ఖమ్మం ప్రాంతానికి రైలు మార్గం ద్వారా గంజాయి రవాణా జరుగుతోందనే విశ్వసనీయ సమాచారంతో మంగళవారం ఎక్సైజ్ ఎస్టీఎఫ్ , సీ అండ్ డి బృందాలు రంగంలోకి దిగాయి. ఈ తనిఖీల్లో భాగంగా ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలోని మోతీ నగర్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన సంచులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంచులను విప్పి చూడగా అందులో భారీగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం దాన్ని తూకం వేయగా మొత్తం 15.7 కేజీల బరువు ఉన్నట్లు తేలింది. పట్టుబడిన ఈ గంజాయి విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ. 8 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ​ఈ గంజాయిని అక్కడకు తీసుకువచ్చిన వ్యక్తులు ఎవరనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. స్వాధీనం చేసుకున్న గంజాయిని చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం టూ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఎక్సైజ్ ఎస్టీఎఫ్ సీఐలు వెంకటేశ్వర్లు, నాగరాజులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, గంజాయి రవాణాకు పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

- Advertisement -

Also Read: Inspection : పరిష్కారమే పరమావధి.. నార్సింగిలో జోనల్ కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటన

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News