Homeతెలంగాణఖమ్మంAswaraopeta: పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం.. కౌన్సిలర్ పమ్మిడి గీతాశ్రీ

Aswaraopeta: పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం.. కౌన్సిలర్ పమ్మిడి గీతాశ్రీ

అశ్వారావుపేట(తెలుగు ప్రభ): భారత ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల చారిత్రాత్మక రాజకీయ ప్రస్థానాన్ని మరియు జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక హెల్త్ క్యాంప్, ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ 17వ వార్డు కౌన్సిలర్ పమిడి గీతాశ్రీ, పార్టీ జిల్లా కార్యదర్శి పమిడి లక్ష్మీనారాయణల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితిపై అవగాహన కల్పించారు.

- Advertisement -

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. సమాజ ఆరోగ్యం, గ్రామాలు-పట్టణాల పరిశుభ్రత కోసం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికుల పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. ప్రజలు ఉదయం నిద్రలేవక ముందే వీధుల్లోకి చేరి చెత్తను తొలగిస్తూ, రోడ్లు మరియు కాలనీలను శుభ్రంగా ఉంచేందుకు వారు పడే శ్రమ ఎంతో విలువైనదన్నారు. ఎండ, వాన, చలి వంటి ప్రతికూల పరిస్థితులను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న వారి సేవలను ప్రతీ ఒక్కరూ గుర్తించి గౌరవించాలని కోరారు.అనంతరం పారిశుధ్య కార్మికులకు శాలువాలు కప్పి, తీపి తినిపించి తమ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా కార్మికుల పట్ల తమకున్న గౌరవాన్ని చాటుతూ కౌన్సిలర్ పమిడి గీతాశ్రీ, లక్ష్మీనారాయణ వారి కాళ్లు కడిగి, ఆ నీటిని నెత్తిన చల్లుకుని వినూత్నంగా గౌరవించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రధాని మోదీ సేవా భావాన్ని స్పూర్తిగా తీసుకుని సమాజంలోని వివిధ వర్గాలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలను చేపడుతున్నామని, ప్రత్యక్షంగా సమాజ నిర్మాణంలో భాగస్వాములవుతున్న కార్మికులను గౌరవించడం ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మెట్ట వెంకటేష్, మండల ప్రభారీ ఉడతనేని విశ్వేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి రాయుడు అంజనేయులు, మేడవరుపు కృష్ణ చైతన్య, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఎస్వీటీ కొండ, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు తానికొండ రాంబాబు, ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తంబళ్ల రవి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గొట్టిపూళ్ల దుర్గా శ్రీనివాస్, జిల్లా సెల్ కన్వీనర్ సొలస పుష్కర్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు రవిక్రింది కుమార్ రాజా, సీమకుర్తి సుబ్బారావు, సోమిశెట్టి లక్ష్మీ నరసింహారావు, ములగచర్ల సాయి కృష్ణ, పమిడి అప్పారావు, పమిడి సహదేవ్, దమ్మపేట మండల అధ్యక్షుడు పల్లపు వెంకటేశ్వరరావు, సోషల్ మీడియా భద్రాద్రి జిల్లా కన్వీనర్ నాగుల చందు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News