Homeతెలంగాణఖమ్మంAshwapuram: అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సిరంజీల కరువు

Ashwapuram: అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సిరంజీల కరువు

అశ్వాపురం (తెలుగు ప్రభ): పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం ఇంజక్షన్ చేసేందుకు అవసరమైన సిరంజీలు కూడా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొంతకాలంగా సిరంజీల కొరత వేధిస్తున్నా, సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాము కాటు, తేలు కాటు వంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ వైద్యం అందించాల్సి ఉంటుంది. అలాంటి సమయాల్లో సిరంజీలు అందుబాటులో లేకపోతే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు బాధితులు మణుగూరు, భద్రాచలం ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోందని, అక్కడ కూడా అవసరమైన వైద్య సామగ్రి అందుబాటులో లేక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆరోపిస్తున్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో కనీస వైద్య సామగ్రిని కూడా అందుబాటులో ఉంచలేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

అధికారులు స్పందించేనా?

ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తక్షణమే సిరంజీలతో పాటు అవసరమైన వైద్య సామగ్రిని సరఫరా చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి కొరతలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News