Homeతెలంగాణఖమ్మంUtlapally: ఉట్లపల్లిలో ఉద్ధృత నీటి ప్రవాహం.. బైక్‌తో సహా కొట్టుకుపోయిన వ్యక్తి

Utlapally: ఉట్లపల్లిలో ఉద్ధృత నీటి ప్రవాహం.. బైక్‌తో సహా కొట్టుకుపోయిన వ్యక్తి

అశ్వారావుపేట (తెలుగుప్రభ): మురుసు తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు అశ్వారావుపేట మండలంలోని ఉట్లపల్లి సమీపంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా రోడ్డుపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తి అదుపు తప్పి ఉధృతంగా ప్రవహిస్తున్న వరద కాలువలో పడిపోయాడు.

- Advertisement -

వరద ఉధృతికి బైక్‌తో సహా నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు, స్థానికులు గమనించారు. క్షణాల వ్యవధిలో అప్రమత్తమైన వారు ప్రాణాలకు తెగించి సాహసోపేతంగా వరద నీటిలోకి దిగారు. ఉధృత ప్రవాహాన్ని లెక్కచేయకుండా శ్రమించి, కొట్టుకుపోతున్న వ్యక్తిని పట్టుకుని సురక్షితంగా బయటకు లాగారు.

బాధితునికి వెంటనే ప్రాథమిక చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు, స్థానికులు సకాలంలో స్పందించి సమయస్ఫూర్తితో వ్యవహరించకపోతే పెద్ద ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. ప్రాణాలను పణంగా పెట్టి సాహసంతో నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసులను, స్థానిక యువకులను గ్రామస్తులు, ప్రజలు అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News