HomeతెలంగాణKishan Reddy: కేంద్రం పైసలిస్తున్నా.. ఎందుకు కొనడం లేదు?.. రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్‌ రెడ్డి సూటి...

Kishan Reddy: కేంద్రం పైసలిస్తున్నా.. ఎందుకు కొనడం లేదు?.. రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్‌ రెడ్డి సూటి ప్రశ్న

Kishan Reddy comments on grain procurement: ధాన్యం కొనుగోళ్లకు ప్రతి పైసా కేంద్రమే చెల్లిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రం డబ్బులిస్తున్నా.. రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని విమర్శించారు. ‘‘ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చడం లేదు. సన్నవడ్లకు బోనస్‌ ఇవ్వడం లేదు. ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు పెద్ద ఎత్తున రోడ్ల మీదికొచ్చి ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వమే వారి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మంత్రులు హైదరాబాద్‌ను వీడి జిల్లాలకు వెళ్లి, ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలి’’ అని కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

- Advertisement -

Also read: Nara Lokesh: నిర్మాణ దశలోనే అందర్నీ ఆకర్షిస్తోన్న అమరావతి.. మంత్రి లోకేశ్‌ ట్వీట్‌ వైరల్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News