KRMB Meeting: హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(KRMB) త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల మధ్య తాగునీటి అవసరాల కోసం నీటి విడుదలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Also Read: https://teluguprabha.net/top-stories/sit-notices-to-bandi-bhagirath/
శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి తెలుగు రాష్ట్రాలకు తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేయడానికి బోర్డు అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్‌కు ఆగస్టు 15 వరకు 10 టీఎంసీల నీటిని నాగార్జున సాగర్ నుంచి వినియోగించుకోవడానికి అనుమతి లభించింది. అయితే శ్రీశైలం నుంచి ఏపీకి బోర్డు ఎలాంటి కేటాయింపులు చేయలేదు.
Also Read: https://teluguprabha.net/telangana/ponguleti-on-indirammas-house/
ఇక, తెలంగాణకు నాగార్జున సాగర్ నుంచి 16 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 6 టీఎంసీల నీటిని వాడుకోవడానికి బోర్డు అనుమతి లభించింది. ఈ వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించడానికి ఈ నీటిని కేటాయించినట్లు బోర్డు పేర్కొంది. పెండింగ్ అంశాలు, నీటి విడుదలపై మరిన్ని నిర్ణయాల కోసం బోర్డు మే 14న మరోసారి సమావేశం కానుంది. ఈ సమావేశంలో కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజ్, తెలంగాణ ఈఎన్సీ రమేష్ బాబు, ఏపీ ఈఎన్సీ నరసింహ మూర్తి పాల్గొన్నారు.

