HomeTop StoriesKTR: వట్టినాగులపల్లిలో భూకబ్జాల ఆరోపణలు.. గవర్నర్‌కు బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

KTR: వట్టినాగులపల్లిలో భూకబ్జాల ఆరోపణలు.. గవర్నర్‌కు బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

KTR Complaint to Governor: హైదరాబాద్ శివారు వట్టినాగులపల్లిలో భూకబ్జాలపై బీఆర్‌ఎస్‌ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రి పొంగులేటి కుమారుడు అసైన్డ్‌ భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించిన కేటీఆర్‌.. అన్ని వివరాలను గవర్నర్‌కు అందజేసినట్లు తెలిపారు. అడ్డగోలుగా మైనింగ్‌ చేస్తు్నన విషయాన్ని గవర్నర్‌కు వివరించామన్నారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్‌ చేయాలని.. అసెంబ్లీలో సభాసంఘం వేయాలని డిమాండ్‌ చేశారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/cinema-news/ambati-madhumohan-krishna-elected-as-ap-film-chamber-president-245931/

వట్టినాగులపల్లిలో జరిగిన భూకబ్జా ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతృత్వంలోని బృందం సోమవారం గవర్నర్‌ శివప్రతాప్ శుక్లాకు ఫిర్యాదు చేసింది. వట్టినాగులపల్లిలో సుమారు రూ. 1,400 కోట్ల విలువైన ప్రైవేట్‌ భూములను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన సంస్థలు కబ్జా చేశాయని బీఆర్‌ఎస్‌ ఆరోపణలు చేస్తోంది. మంత్రిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసి అధికారికంగా ఫిర్యాదు చేసింది.

అంతకుముందుగా కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వట్టినాగులపల్లిలో పర్యటించి, కబ్జాకు గురైన భూముల బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక కోటి ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చి, పేదలను వేధిస్తున్నారని విమర్శించారు.

Also Read: https://teluguprabha.net/top-stories/brs-complaint-to-governor-about-irregularities-of-minister-ponguleti-srinivas-reddy/

మరోవైపు అసెంబ్లీలో ఈ విషయంపై చర్చ జరగ్గా.. దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. మాజీ మంత్రి హరీష్‌రావు బంధువులే భూకబ్జాలకు పాల్పడ్డారని ఎదురుదాడి చేశారు. అవసరమైతే దీనిపై ‘హౌస్‌ కమిటీ’ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమని ఆదివారం సీఎం రేవంత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News