KTR Comments on Bandi Baghirath Pocso case: పోక్సో కేసు విషయంలో బండి భగీరథ్‌ను కాపాడేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ కుమ్మక్కయ్యారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రి అంటున్న రేవంత్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు సిద్ధమవ్వాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. తాము కూడా రాజీనామా చేస్తామన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ధాన్యం కొనుగోళ్లు, బండి భగరథ్ కేసు సహా వివిధ అంశాలపై కేటీఆర్ మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని రైతులే కాదు.. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ధర్నాలు చేస్తున్నారు.
Also read: Ramdev Rao: వారంతా కల్లు కాంపౌండ్లు నడిపేవారే.. రామ్ దేవ్ రావు సంచలన వ్యాఖ్యలు
ధాన్యం కొనుగోలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి..
సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనూ రైతులు నిరసన తెలిపారు. రాష్ట్రంలో 35 శాతానికి మించి ధాన్యం కొనుగోళ్లు జరగలేదు. ఏ విషయంలోనూ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదు. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 10 మంది రైతులు చనిపోయారు. 45 డిగ్రీల ఎండలో రైతులు పడిగాపులు కాస్తున్నారు. శనివారం జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ అంశమే ప్రధాన అజెండాగా ఉండాలి. ప్రభుత్వం ఎంత ధాన్యం కొనుగోలు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలి. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌ని 9 రోజులు దాచిపెట్టిందెవరో చెప్పాలి. సామాన్యుడైతే పోలీసులు ఊరుకుంటారా? కేంద్ర మంత్రి కొడుకైనా, సాధారణ వ్యక్తైనా చట్టం ముందు అందరూ సమానమే. నిందితుడిని నిందితుడిగానే చూడాలి’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

