KTR Comments on CAs: చార్టర్డ్ అకౌంటెంట్లు కేవలం పన్నుల లెక్కలకే పరిమితం కాకూడదని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. వ్యాపారాలను వృద్ధి చేసే సలహాదారులుగానూ సీఏలు ఎదగాలని ఆకాంక్షించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను తమ వృత్తిలో భాగం చేసుకోవాలని కోరారు. గచ్చిబౌలిలో ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా’ (ICAI) స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు. భవిష్యత్తులో వ్యాపార అవకాశాల్లో సీఏల పాత్ర అత్యంత కీలకంగా మారుతుందని జోస్యం చెప్పారు. ట్యాక్స్‌లు, జీఎస్టీ, వ్యాపారాల విస్తరణలో వారి అవసరం చాలా పెరుగుతుందన్నారు. ప్రసతంగం అనందరం, సీఏలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆయన సత్కరించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల త్యాగాలను, కష్టాన్ని ఎప్పటికీ మరువకూడదని వారిని ఎల్లప్పుడూ గౌరవించాలని, సీఏలుగా ఉన్నత స్థితిలోకి చేరుకోవాలని ఆకాంక్షించారు.
KTR: సీఏలు పన్నుల లెక్కలకే పరిమితం కావొద్దు.. ఐసీఏఐ స్నాతకోత్సవంలో కేటీఆర్ సూచనలు
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

