HomeతెలంగాణKTR: రైతు డిస్కం పేరుతో రేవంత్‌ కొత్త నాటకం.. మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కుట్ర.. కేటీఆర్‌...

KTR: రైతు డిస్కం పేరుతో రేవంత్‌ కొత్త నాటకం.. మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కుట్ర.. కేటీఆర్‌ హాట్‌ కామెంట్స్‌

KTR Comments on CM Revanth Reddy about Rythu Discom: రైతు డిస్కం పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి కొత్త నాటకం ఆడుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. నేడు సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ‘‘సీఎం రేవంత్‌ గతంలో సాగుకు రోజుకు 3 గంటల ఉచిత విద్యుత్‌ చాలన్నారు. ఇప్పుడు మాటమార్చి రైతు డిస్కం ఏర్పాటు చేస్తామంటున్నారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టి, రైతుల మెడకు ఉరి పెట్టే డిస్కం అది. కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక సమయంలో స్థానికంగా ఆరు వేల ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. గెలిచాక పత్తా లేకుండా పోయారు. ఇప్పటి వరకు ఆరు ఇళ్లయినా కట్టించారా? రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేయవాలి. కేసీఆర్‌ పాలనలో రైతు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేశారు. రూ. 4 లక్షల కోట్ల అప్పులు చేసిన రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి.’’ అని కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

- Advertisement -

Also Read: Naga Chaitanya: నువ్వొచ్చాకే నా జీవితం మారింది.. శోభితాకు స్పెషల్‌ బర్త్‌డే గిఫ్ట్‌.. నాగ చైతన్య పోస్ట్‌ వైరల్‌..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News