KTR Comments: రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా పరిస్థితులు మారిపోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఒక బాలికకు అన్యాయం జరిగితే ప్రభుత్వం మిన్నకుండిపోయిందని ఆరోపించారు. అధికార కాంగ్రెస్, బీజేపీ కలిసి బాలికకు అన్యాయం చేయాలని చూశాయని కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో ‘నా బూత్- నా భవిష్యత్తు’ కార్యక్రమంలో బీఎల్‌ఏలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
Also Read: https://teluguprabha.net/telangana/major-fire-at-yadadri-thermal-power-plant/
‘బాలికకు న్యాయం జరగాలని నిలబడి, పోరాడింది మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీయే. బీఆర్‌ఎస్, అనుబంధ సంఘాల పోరాటం వల్లే బాలికకు కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. తప్పు చేసిన వ్యక్తిని 9 రోజుల పాటు దాచిపెట్టింది కేంద్ర మంత్రి కాదా.? కేంద్ర మంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి కలిసి పోక్సో కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. చట్టాన్ని గౌరవించకుండా నిందితుడిని దాచిపెట్టిన కేంద్ర మంత్రిని ప్రధాని మోదీ వెంటనే బర్తరఫ్ చేయాలి.’- కేటీఆర్
Also Read: https://teluguprabha.net/telangana/high-temperatures-in-telugu-states-for-the-next-week/
అసలు బండి భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారా లేదా ఆయనే లొంగిపోయాడా అని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. సామాన్యులకు ఓ న్యాయం, అధికారంలో ఉన్న వారికి ఓ న్యాయమా అని ప్రశ్నించారు. ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

