HomeTop StoriesKTR fires: మోదీ ఒత్తిడికి తలొగ్గి మోటార్లకు మీటర్లు బిగించే కుట్ర.. రేవంత్ సర్కారుపై కేటీఆర్...

KTR fires: మోదీ ఒత్తిడికి తలొగ్గి మోటార్లకు మీటర్లు బిగించే కుట్ర.. రేవంత్ సర్కారుపై కేటీఆర్ ఫైర్

KTR fires on Congress government: తెలంగాణ రైతుల కోసం కేసీఆర్‌ తీసుకొచ్చిన ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేయాలనే ఏకైక ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అందులో భాగంగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తోందని ఆరోపించారు. ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు కుట్ర పన్నుతోందని ఆయన విమర్శించారు. ఆదివారం బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో వ్యవసాయ కనెక్షన్లతో పాటు అన్ని గృహ కనెక్షన్లకూ ప్రీపెయిడ్ మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాబోయే మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లలోని పాత మీటర్లను తొలగించి, వాటి స్థానంలో ఈ కొత్త ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నారని తెలిపారు. గతంలో ప్రధాని మోదీ ఎంత ఒత్తిడి తెచ్చినా, రూ.30 వేల కోట్ల రుణం నిలిపివేసినా నాటి సీఎం కేసీఆర్.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడానికి అంగీకరించలేదని కేటీఆర్ గుర్తుచేశారు.

- Advertisement -

Also Read: Safety on the bus: బస్సుల్లో మహిళలకు మరింత సేఫ్టీ.. ఇకపై ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడితే అంతే సంగతులు..!

ఉచిత విద్యత్‌ పథకానికి మంగళం పాడే కుట్ర..

కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి తలొగ్గి మోటార్లకు మీటర్లు బిగించాలని నిర్ణయించిందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ రద్దు అవుతుందని, మోటార్లకు మీటర్లు వస్తాయని తాము హెచ్చరించిన విషయం ఇప్పుడు నిజమవుతోందన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించకముందే, ఇళ్లకు ప్రీపెయిడ్ మీటర్లు రాకముందే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి, అరాచకాలతో పాలన సాగిస్తోందని ఫైరయ్యారు. కాంగ్రెస్‌ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా ప్రజలే వారికి బుద్ధి చెబుతారన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News