HomeతెలంగాణDrugs Case KTR: ‘ఇప్పటికే చాలా సార్లు చెప్పా.. నన్ను లాగితే చట్టపరంగా నోటీసులిస్తా’

Drugs Case KTR: ‘ఇప్పటికే చాలా సార్లు చెప్పా.. నన్ను లాగితే చట్టపరంగా నోటీసులిస్తా’

Drugs Case KTR Response: మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో తనను అనవసరంగా లాగుతున్నారంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. చట్టపరంగా నోటీసులిస్తానని హెచ్చరించారు. తాను ఏ పరీక్షనైనా సిద్ధమని స్పష్టం చేశారు. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీపై పోలీసుల దాడిలో పలువురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఈ వివాదం మొదలైంది. ఈ అంశంపై కేటీఆర్ స్పందించారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/devotional-news/chilkur-balaji-temple-hyderabad-visa-temple-history-speciality/

మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో తన పేరును లాగిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెచ్చరించారు. డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు తాను పూర్తిగా వ్యతిరేకమని పేర్కొన్నారు. డ్రగ్స్‌ కేసులో బీఆర్‌ఎస్‌ పార్టీని లాగడాన్ని ఖండిస్తున్నానని.. డ్రగ్స్ కేసును బీఆర్‌ఎస్‌పై రాజకీయ ప్రతీకారంగా వాడుకోవడం అసహ్యకరమైన రాజకీయాలని ఎద్దేవా చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా డ్రగ్స్ వాడేవారు లేదా సరఫరా చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

‘నేను ఇప్పటికే పలుమార్లు చెప్పినట్లుగా ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నాను. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ఈ పరీక్ష చేయాలని మహేష్ కుమార్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నాను. అదేవిధంగా ప్రతి డ్రగ్స్‌ కేసులో నా పేరును అనవసరంగా లాగితే చట్టపరమైన నోటీసులు ఇస్తాం.’ -కేటీఆర్‌ 

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/pawan-kalyan-participated-in-jana-sena-formation-day-celebrations-in-paderu-constituency/

శనివారం రాత్రి మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌పై పోలీసు ఈగల్ బృందం దాడులు నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ఎంపీ పుట్టా మహేశ్‌కు ప్రస్తుతం స్టేషన్ బెయిల్ మంజూరైంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News