Friday, March 13, 2026
HomeతెలంగాణKTR: ఎక్స్‌ అఫీషియో ఓట్ల నమోదు విషయమై సీఎస్‌, SECతో మాట్లాడాం- కేటీఆర్‌

KTR: ఎక్స్‌ అఫీషియో ఓట్ల నమోదు విషయమై సీఎస్‌, SECతో మాట్లాడాం- కేటీఆర్‌

KTR about Municipal Results: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హంగ్‌ వచ్చిన మున్సిపాలిటీల్లో పరిస్థితి తమకు అనుకూలంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థుల గెలుపు, హంగ్‌ వచ్చిన స్థానాల్లో పార్టీ వ్యూహాలు, ప్రతిపక్షాల తీరుపై ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌ అఫీషియో ఓట్ల నమోదు విషయమై సీఎస్‌, ఎస్‌ఈసీతో మాట్లాడినట్లు కేటీఆర్‌ తెలిపారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/10-months-old-infant-brain-dead-parents-accepted-for-organs-donation/

బీఆర్‌ఎస్‌ 30 మున్సిపాలిటీలను సులువుగా గెలుచుకుంటుందని అంచనా వేసినట్లు మాజీ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. కానీ కొంత తగ్గిందని.. అయితే ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక హంగ్‌గా నిలిచిన మున్సిపాలిటీల్లో పరిస్థితి తమకు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం కీలకమైన ఎక్స్‌ అఫీషియో ఓట్ల నమోదు విషయంలో ఇప్పటికే సీఎస్‌, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో చర్చించినట్లు తెలిపారు. తమ పార్టీకి ఉన్న ప్రజాప్రతినిధుల మద్దతుతో హంగ్‌ ఏర్పడిన చోట ఛైర్మన్‌ పీఠం దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: https://teluguprabha.net/national-news/metro-pillar-collapsed-in-mumbai-four-injured/

‘మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆశించిన మేర మున్సిపాలిటీలు రాలేదు. గాలిలో మేడలు కట్టింది కానీ క్షేత్రస్థాయిలో విజయం సాధించలేదు. కరీంనగర్‌, నిజామాబాద్‌ మినహాయిస్తే బీజేపీ ప్రభావం ఎక్కడా అంతగా లేదు. స్థానికంగా జరిగిన ఎన్నికలు కాబట్టి అక్కడి పరిస్థితులను బట్టే పొత్తులు ఉంటాయి. ఈ ఎన్నికల ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై ఉండబోదు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు పార్టీ కొత్త పాఠాలు నేర్పాయి. భవిష్యత్తులో ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం.‘- కేటీఆర్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News