HomeTop StoriesKTR Comments: తెలంగాణలో మరో భారీ భూ కుంభకోణం.. సీఎం రేవంత్‌ టార్గెట్‌గా మరో బాంబు...

KTR Comments: తెలంగాణలో మరో భారీ భూ కుంభకోణం.. సీఎం రేవంత్‌ టార్గెట్‌గా మరో బాంబు పేల్చిన కేటీఆర్..!

KTR Sensational Comments on Land Scam in Telangana: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్లు చేశారు. రాష్ట్రంలో మరో భారీ భూ కుంభకోణం జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున భూకుంభకోణానికి తెరలేపిందని వివరాలతో సహా వెల్లడించారు. బాలానగర్‌లో 9 వేల 300 ఎకరాల భూ కుంభకోణం జరిగిందని, అక్కడ ఎకరానికి 40 కోట్లు వేసుకున్నా 4 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎంతో విలువైన భూములపై రేవంత్ కుటుంబసభ్యు కన్ను పడింది. జపాన్‌లో ఉన్నప్పుడు కూడా ఆ భూమికి సంబంధించిన ఫైల్‌పై రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారని, రాష్ట్రంలో ఎక్కడ వివాదాస్పద భూములు ఉన్న రేవంత్ ముఠా అక్కడ వాలిపోతోందని పేర్కొన్నారు. మరోవైపు, ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమైందని పేర్కొన్నారు. పరిశ్రమలకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని చెబుతూనే, పెద్ద ఎత్తున క్విడ్‌ ప్రోకోకి పాల్పడుతున్నట్లు వెల్లడించారు.‌ తమ ప్రభుత్వంలో ఎంతో మంది పారిశ్రామిక వేత్తలకు రాయితీలిచ్చాం. కానీ, అందుకు తగ్గట్లు ఉపాధి కూడా కల్పించామని గుర్తు చేశారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/telangana-panchayat-elections-dedicated-commission-report/

నేను ఏ తప్పూ చేయలేదు.. విచారణకు సిద్ధం..

ఇక, ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసుపైనా కేటీఆర్‌ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. నేను ఏ తప్పూ చేయలేదు, లై డిటెక్టర్‌ టెస్టుకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్‌ ప్రభుత్వమిది అంటూ నిప్పులు చెరిగారు. రూ. 2 కోట్ల టర్నోవర్ కంపెనీకి రూ. 1130 కోట్ల టెండర్‌ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. అమృత్‌ పథకం టెండర్లలో అవకతవకలు జరిగినా కేంద్రంలోని బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ మధ్య లోపాయికార ఒప్పందం కారణంనే విచారణ చేయట్లేదని నొక్కి చెప్పారు. టీడీఆర్‌ బాండ్ల విషయంలోనూ భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కాగా, ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతించారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు కేటీఆర్‌ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌లో రూ.54.88 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతి కోరుతూ గతంలో ఏసీబీ లేఖ రాసింది. ఆయన పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయంటూ అందులో పేర్కొంది. ఈక్రమంలో తాజాగా ఏసీబీ అధికారులకు అనుమతి ఇస్తూ గవర్నర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ కేసులో త్వరలోనే ఏసీబీ ఛార్జీషీట్‌ దాఖలు చేసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News