HomeతెలంగాణBRS vs Congress : సవాళ్లు చేసి పారిపోవడం కాంగ్రెస్‌కు అలవాటే.. 20 లక్షల ఇళ్లపై...

BRS vs Congress : సవాళ్లు చేసి పారిపోవడం కాంగ్రెస్‌కు అలవాటే.. 20 లక్షల ఇళ్లపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

KTR Counter to Minister Ponguleti : తెలంగాణ రాజకీయ రణక్షేత్రంలో ఇప్పుడు ‘ఇళ్ల’ చుట్టూ రాజకీయం వేడెక్కుతోంది. సవాళ్లు విసరడం.. ఆపై తుపాకీ రాముడిలా పారిపోవడం కాంగ్రెస్ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటైన విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించడమే కాకుండా, దానికి రెట్టింపు వేగంతో కౌంటర్ ఎటాక్ ప్రారంభించారు. 

- Advertisement -

డబ్బా ఇళ్లు కావాలా? డబుల్ బెడ్‌రూమ్ కావాలా : సవాళ్లు.. పలాయనాలు: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గృహనిర్మాణ పథకాల అమలు తీరును కేటీఆర్ ఎండగట్టారు. గతంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన చరిత్ర కాంగ్రెస్ నేతలదని, ఇప్పుడు కూడా అదే బాటలో పయనిస్తున్నారని విమర్శించారు. “సవాళ్లు చేయడం.. ఆపై ముఖం చాటేయడం హస్తం పార్టీనేతలకు అలవాటే” అంటూ ఎద్దేవా చేశారు.

పొంగులేటి శపథంపై కేటీఆర్ సెటైర్లు: రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లు నిర్మించిన తర్వాతే ఓట్లు అడుగుతామని మంత్రి పొంగులేటి చేసిన ప్రకటనను కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. “మాటలు చెప్పడం కాదు.. చేతనైతే చేసి చూపించండి” అని సవాల్ విసిరారు. 20 లక్షల గృహ ప్రవేశాలు పూర్తయ్యే వరకు పొంగులేటి ప్రజల వద్దకు ఓట్ల కోసం వెళ్లకూడదని డిమాండ్ చేశారు.

నాణ్యతలో రాజీ పడలేదు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను, కాంగ్రెస్ ప్రతిపాదిత ఇందిరమ్మ ఇళ్లతో కేటీఆర్ పోల్చి చూశారు. కాంగ్రెస్ నిర్మించేవి ‘డబ్బా ఇళ్లు’ అని, అవి నివాస యోగ్యం కావని విమర్శించారు. బీఆర్ఎస్ కట్టిన ఒక్కో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, కాంగ్రెస్ హయాంలోని ఏడు ఇందిరమ్మ ఇళ్లతో సమానమని ఆయన స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో రాజీ లేకుండా పేదలకు ఆత్మగౌరవంతో కూడిన గృహాలను అందించామని గుర్తు చేశారు.

హస్తం పార్టీకి చిత్తశుద్ధి ఉందా? : అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా, ఇంకా పథకాల మార్గదర్శకాలపైనే కాలక్షేపం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే దమ్ము, ధైర్యం మంత్రి పొంగులేటికి ఉంటే.. తక్షణమే గృహనిర్మాణ పనులను వేగవంతం చేసి, లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News