KTR’s sensational Comments in Siricilla: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా మీద ఉన్న కోపం సిరిసిల్ల నేతన్నల మీద చూపించొద్దని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సిరిసిల్లలో నిర్వహించిన బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్నో పథకాలను రద్దు చేసిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో స్థానిక నేతన్నలకు ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లు రద్దు చేసిందన్నారు. సిరిసిల్లలో ఉన్నవి చిన్న కుటీర పరిశ్రమలని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బ తీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Australian Open : ఆసీస్ గడ్డపై ఆశలు ఆవిరి: ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లో సింధుకు షాక్!
ఉన్న బ్యాగులన్నీ రాహుల్ గాంధీకి వెళ్లాయి..
‘‘రైతుల ధాన్యం కొనేందుకు రాష్ట్రంలో కనీసం గన్నీ సంచులు లేవు. ఉన్న బ్యాగులన్నింటిలో డబ్బులు నింపి రాహుల్ గాంధీకి పంపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలు 900 రోజులైనా నెరవేర్చలేదు. హామీల గురించి ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరైనా, కేసీఆర్‌ను మాత్రమే చూసి వచ్చే ఎన్నికల్లో గెలిపించాలి. కేసీఆర్ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది.’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

