Lady IPS: గిరిజన కుంభమేళా మేడారం జాతర భక్తిపారవశ్యంతో ముగిసింది. అయితే ఈ జాతరలో అమ్మవార్ల రాకతో పాటు ఒక మహిళా పోలీస్ అధికారిణికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. సారలమ్మను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో తోటి అధికారులతో కలిసి ఆమె వేసిన ఉత్సాహభరితమైన స్టెప్పులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆమె అందం, అభినయానికి ఫిదా అయిన నెటిజన్లు ఈమెను “మేడారం మోనాలిసా” అంటూ అభివర్ణిస్తున్నారు.
ఎవరీ అధికారిణి?: వైరల్ అవుతున్న ఈ అధికారిణి పేరు వసుంధర యాదవ్. 2023 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈమె.. ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి సబ్ డివిజన్ పరిధిలోని కల్లూరు ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వసుంధర.. 2024లో తెలంగాణ కేడర్‌కు బదిలీపై వచ్చారు. జాతర విధుల్లో భాగంగా ఆమె మేడారంలో విధులు నిర్వహించారు.
వసుంధర భర్త కలెక్టర్‌గా సేవలు: వసుంధర యాదవ్ వ్యక్తిగత జీవితం కూడా ఆసక్తికరంగానే ఉంది. ఆమె భర్త అజయ్ యాదవ్ 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. వీరి వివాహం 2025 ఫిబ్రవరిలో లక్నోలో ఘనంగా జరిగింది. ప్రస్తుతం అజయ్ యాదవ్ కూడా తెలంగాణలోనే కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Also read-Medaram Jatara: భక్త జన సంద్రంగా మేడారం.. మొక్కు చెల్లించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్
ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు: గతంలో కుంభమేళాలో పూసలమ్మే యువతి ‘మోనాలిసా’గా గుర్తింపు పొంది ఓవర్‌నైట్ సెలబ్రిటీగా మారగా, ఇప్పుడు విధుల్లో ఉంటూనే తన ఉత్సాహంతో నెటిజన్ల మనసు గెలుచుకున్నారు వసుంధర యాదవ్. ఒక బాధ్యతాయుతమైన అధికారిణి ఇలా జానపద వేడుకలో మమేకం కావడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Saralamma's procession from Kannepalli to Medaram ..#SammakkaSarakka #MedaramJatara pic.twitter.com/Rt7gfxYtcq
— Danasari Seethakka (@seethakkaMLA) January 29, 2026

