HomeTop Storiesponguleti srivivas reddy: త్వరలోనే భూములకు రెక్కలు.. అక్కడ ఏకంగా రూ. 15 లక్షల పెంపు.....

ponguleti srivivas reddy: త్వరలోనే భూములకు రెక్కలు.. అక్కడ ఏకంగా రూ. 15 లక్షల పెంపు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Land rates in Telangana soar in Telangana: తెలంగాణలో భూముల విలువ పెంపుపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక అప్‌డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో త్వరలో భూముల మార్కెట్ విలువ పెంచబోతున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్‍ శివారు ప్రాంతాల్లో ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌ విలువకు, ప్రభుత్వ మార్కెట్‌ విలువకు చాలా వ్యత్యాసం ఉందని, ఆయా భూముల మార్కెట్ విలువను సైంటిఫిక్‌గా పెంచుతామని తెలిపారు.

- Advertisement -

Also read: CM Vijay Team : సీఎం విజయ్ వద్దే హోం.. తమిళ మంత్రులకు కేటాయించిన శాఖలివే..!

నగరు శివారు ప్రాంతాల్లో రూ. 15 లకలు పెరిగే ఛాన్స్..

ఏరియాని బట్టి ఎకరానికి కనీసం రూ. 15 లక్షల మేర పెరిగే అవకాశం ఉందన్నారు. ఇవాళ మీడియా ప్రతినిధుల చిట్ చాట్‌లో మాట్లాడిన ఆయన.. ఓఆర్ఆర్, ట్రిపుల్‌ఆర్‌ క్రైటిరియాగా తీసుకొని భూముల రేట్లు పెంచబోతున్నట్లు తెలిపారు. అరవింద్ సుబ్రహ్మణ్యం రిపోర్టు ఆధారంగా గత ప్రభుత్వం రెండు సార్లు భూముల విలువ పెంచిందని గుర్తు చేశారు. కాంగ్రెస ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా భూముల రేట్లు పెంచలేదని, 2022 నుంచి ఇప్పటి వరకు భూముల మార్కెట్ విలువ గతంలో మాదిరిగానే ఉందని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News