మహిళలు ఎక్కడికైనా ఉచితంగా వెళ్లే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఉచిత బస్సు విషయంలో కొందరు మహిళలను అవమానిస్తున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణాలు 10 కోట్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని జ్యోతిరావుపూలే ప్రజాభవన్‌లో మహాలక్ష్మీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకకర్, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పాల్గొన్నారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/tovino-thomas-clarifies-he-is-not-act-in-jr-ntr-dragon/
‘ఉచిత బస్సు విషయంలో కొందరు మహిళలను అవమానిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు చెడిపోతున్నారంటూ కొందరు మాట్లాడటం సరికాదు. మహిళల పట్ల వెకిలిగా మాట్లాడిన వారికి తగిన బుద్ధి చెప్పాలి. మహిళలకు ఇచ్చిన హామీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి మాత్రమే ఇంకా అమలు చేయలేదు. పెండింగ్‌లో ఉన్న ఒక్క హామీని కూడా త్వరలోనే అమలు చేస్తాం. మహిళలతో మిల్లులు, పెట్రోల్ బంకులు, సోలార్‌ప్లాంట్లు పెట్టిస్తున్నాం. మహాలక్ష్మి పథకం వల్ల మహిళలకు ఇప్పటివరకు దాదాపు రూ. 10 వేల కోట్లు ఆదా అయ్యాయి.’ – మంత్రి సీతక్క
Also Read: https://teluguprabha.net/cinema-news/anupam-kher-reacts-on-negative-comments-on-dhurandhar-2/
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్ములుగా భావిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని, ఈ పథకం ప్రారంభించినప్పుడు ఆర్టీసీ నష్టపోతుందంటూ కొందరు మాట్లాడారని గుర్తుచేశారు. మహాలక్ష్మి టికెట్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా ఆర్టీసీకి చెల్లిస్తోందని భట్టి స్పష్టం చేశారు.

