Homeతెలంగాణమహబూబ్‌నగర్‌Balanagar: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మాజీ సర్పంచ్‌ సహా పలువురు నేతలు

Balanagar: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మాజీ సర్పంచ్‌ సహా పలువురు నేతలు

బాలానగర్(తెలుగు ప్రభ): బాలానగర్ మండలంలోని పెద్దరేవల్లి గ్రామంలో రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీకి చెందిన మాజీ సర్పంచ్ లింగారెడ్డితో పాటు వివిధ పార్టీలకు చెందిన సుమారు 20 మంది కార్యకర్తలు నేడు జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ సముచిత గౌరవం కల్పిస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామీణ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News