Female constable suicide: మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ.. ప్రస్తుతం దారూర్ సీఐ కార్యాలయానికి అటాచ్‌మెంట్‌పై పనిచేస్తున్న దివ్య (28) తన నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. శనివారం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో దివ్య ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
వేధింపుల కోణంలో దర్యాప్తు: దివ్య ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే విధి నిర్వహణలో ఒత్తిడి ఉందా? లేక ఎవరైనా ఆమెను వేధించారా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆమె మొబైల్ ఫోన్ కాల్ డేటాను సైతం విశ్లేషిస్తున్నట్లు సమాచారం. కేవలం 28 ఏళ్ల వయసులోనే.. పోలీస్ శాఖలో పనిచేస్తున్న యువతి ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం తోటి సిబ్బందిని, కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

