Homeతెలంగాణమహబూబ్‌నగర్‌Narayanpet : ఆలయంలో విగ్రహ ధ్వంసానికి యత్నం.. బీజేపీ నేతల ఆగ్రహం

Narayanpet : ఆలయంలో విగ్రహ ధ్వంసానికి యత్నం.. బీజేపీ నేతల ఆగ్రహం

మక్తల్, (తెలుగు ప్రభ): సంతోషిమాత ఆలయంలో జరిగిన దాడి ఘటనపై నారాయణపేట జిల్లా బీజేపీ కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు వెంకట రాములు ముదిరాజ్‌, బీజేపీ ప్రధాన కార్యదర్శి జి. బలరాం రెడ్డి స్పందించారు.హైదరాబాద్‌లోని చైతన్యపురి భవానీనగర్‌ కాలనీలోని సంతోషిమాత ఆలయంలో నిన్న జరిగిన దాడి కలకలం రేపింది. ఓ వ్యక్తి కర్రలతో ఆలయంలోకి చొరబడి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించడంతో పాటు అడ్డుకున్న భక్తులపై దాడికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

ఆలయాల భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఘటనపై వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఆలయంపై దాడికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కనకరాజు, వాకిట మల్లేష్‌, చీరాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News