Wanaparthy: వనపర్తి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఖిల్లా గణపురం మండలం సల్కలాపురం గ్రామంలో ఓ కుటుంబ యజమాని తన భార్య, ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా హతమార్చాడు. ఆపై తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య: పోలీసుల సమాచారం ప్రకారం.. సల్కలాపురం గ్రామానికి చెందిన నరసింహ అనే వ్యక్తి బుధవారం తెల్లవారుజామున ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. పది, ఎనిమిదో తరగతి చదువుతున్న తన ఇద్దరు పిల్లలను ఇంటి ఆవరణలోని నీటి సంపులో పడేసి ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత భార్యకు ఉరివేసి హత్య చేశాడు. భార్యాపిల్లలు ముగ్గురిని కడతేర్చిన అనంతరం.. నరసింహ సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Also read-Crime: పులివెందులలో ఘోరం.. కన్నకూతురిపై అత్యాచారయత్నానికి సహకరించిన తల్లి!
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో సల్కలాపురం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. నరసింహ ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

