Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైపాస్ రోడ్డులో స్పోర్ట్స్ బైక్, కారు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
అతివేగమే కారణం: ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి అతి వేగమే ప్రధాన కారణమని తెలుస్తోంది. మహబూబ్‌నగర్ బైపాస్ రోడ్డులో ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్, ఎదురుగా వస్తున్న కారును అత్యంత వేగంగా ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రభావంతో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. దీంతో స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులతో పాటు కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

