HomeతెలంగాణTelangana: నేటి నుంచి మహిళా వారోత్సవాలు

Telangana: నేటి నుంచి మహిళా వారోత్సవాలు

Mahila Varotsavalu: రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి మహిళా వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 31 వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 10.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్ విధానంలో రాష్ట్రంలోని గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

- Advertisement -

వారం పాటు వారోత్సవాలు: మహిళా ఉన్నతి- తెలంగాణ ప్రగతి నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు కట్టుబడి ఉందని పంచాయతీరాజ్‌, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సోమవారం నుంచి ఈ నెల 31 వరకు సాగే ఈ వారోత్సవాల్లో భాగంగా గ్రామ, మండల స్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.

వారం రోజుల పాటు నిర్వహించే ముఖ్య కార్యక్రమాలు:

  • భవనాల నిర్మాణ శంకుస్థాపనలు: గ్రామాలు, మండలాల్లో ఇందిరా మహిళాశక్తి భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి భూమిపూజ.
  • చైతన్య కార్యక్రమాలు: మహిళల భద్రత, చట్టాలపై ప్రత్యేక అవగాహన సదస్సులు.
  • గ్రీన్ ఎనర్జీ: మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్‌ పవర్‌ ప్లాంట్ల స్థాపన.
  • విద్య, ఆరోగ్యం: విద్యా వ్యాప్తికై ‘ఉల్లాస్‌’ కార్యక్రమం, చిన్నపిల్లల ఆరోగ్యం-పోషణకై అమ్మ మాట – అంగన్వాడీ బాట. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News