HomeతెలంగాణFire Accident: యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న సిబ్బంది

Fire Accident: యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న సిబ్బంది

Major fire at Yadadri Thermal Power Plant: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పవర్‌ ప్లాంట్‌లోని యూనిట్‌-3లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలముకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, యూనిట్‌-3లో జరిగిన విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ​పంప్ వద్ద ఆయిల్ లీకేజీ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ఈ ప్ర‌మాదంతో చుట్టుప‌క్క‌ల పరిసర ప్రాంతాల్లో పొగ ద‌ట్టంగా అలుముకుంది. ​కంట్రోల్ కేబుల్స్, వాల్వ్‌లు దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రధాన యంత్రాలకు ముప్పు త‌ప్పిన‌ట్లు తెల‌స్తోంది.

- Advertisement -

Also read: AI Effect: ముంచుకొస్తున్న ఏఐ ముప్పు.. ఇకపై ఫ్రెషర్స్‌కు గడ్డు కాలమే.. సర్వేలో సంచలన విషయాలు

భయంతో పరుగులు తీసిన స్థానికులు..

కాగా, పవర్‌ ప్లాంట్‌లో భారీగా మంట‌లు చెల‌రేగ‌డంతో స్థానికులు భ‌యాందోళ‌న‌ల‌తో బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫైర్ సేఫ్టి ప‌రిక‌రాల‌తో మంట‌లను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు య‌త్నిస్తున్నారు. అయితే, ఈ దుర్ఘటనలో సిబ్బంది ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News