HomeతెలంగాణVamsi Mohan arrest: మల్కాజిగిరి డిప్యూటీ కలెక్టర్‌ అరెస్ట్‌.. ఏసీబీ తనిఖీల్లో సంచలన విషయాలు వెల్లడి

Vamsi Mohan arrest: మల్కాజిగిరి డిప్యూటీ కలెక్టర్‌ అరెస్ట్‌.. ఏసీబీ తనిఖీల్లో సంచలన విషయాలు వెల్లడి

Malkajgiri Deputy Collector arrest: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో మేడ్చల్‌ మల్కాజిగిరి డిప్యూటీ కలెక్టర్‌ వంశీ మోహన్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వంశీ మోహన్‌పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఇవాళ ఉదయం నుంచి ఆయన కార్యాలయం సహా మరో 11 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఆయన బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వంశీ మోహన్‌కు సంబంధించిన భారీ ఆస్తులను గుర్తించారు. తనిఖీల్లో రూ.4.46 కోట్ల విలువైన 19 ఓపెన్‌ ప్లాట్లు, రూ.1.12 కోట్ల విలువగల 3 ఇళ్లను వనస్థలిపురం, మణికొండ, మజీద్‌కొండ ప్రాంతాలతో పాటు ఇబ్రహీంపట్నం పరిధిలోని నారపల్లి వద్ద 2 ఎకరాల్లో ఫాంహౌస్‌ ఉన్నట్లు గుర్తించారు.

- Advertisement -

Also read: KTR Comments: పోక్సో కేసు విషయంలో వారిద్దరూ కుమ్మక్కయ్యారు.. కేటీఆర్‌ హాట్‌ కామెంట్స్‌

అక్రమ మార్గంలో ప్రభుత్వ భూములు స్వాహా..

శేరిలింగంపల్లి, ఇతర ప్రాంతాల్లో ఆర్డీవోగా పనిచేసిన వంశీమోహన్.. అక్రమ మార్గంలో భారీగా ప్రభుత్వ భూములను కాజేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌, పిగ్లీపురంలో 8 ఎకరాలు ఆక్రమించినట్లు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులపై విచారణ జరిపిన ఏసీబీ అధికారులు.. వంశీ మోహన్‌ ప్రభుత్వ భూములను తన మామ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించి.. ఆ తర్వాత రియల్టర్‌కు ధారాదత్తం చేసినట్టు గుర్తించారు. ఓ రియల్టర్‌ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్‌ డీడ్‌ చేయించుకున్నట్టుగా ఏసీబీ అధికారులు నిగ్గు తేల్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News