HomeTop StoriesDGP CV Anand: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. పోలీసుల ఎదుట లొంగిపోయిన నరహరి

DGP CV Anand: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. పోలీసుల ఎదుట లొంగిపోయిన నరహరి

Maoist Narahari surrenders before police: వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ తీవ్ర గట్టు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆపరేషన్‌ కగార్‌తో దాదాపు కనుమరుగయ్యే పరిస్థితికి చేరింది. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీకి మరో బిగ్‌షాక్‌ తగిలింది. మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలకంగా పనిచేస్తున్న కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి.. తన భార్య దానమ్మతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. నరహరిని మీడియా ఎదుట ప్రవేశపట్టిన అనంతరం డీజీపీ సీవీ ఆనంద్‌ పలు కీలక విషయాలు వెల్లడించారు. నరహరి లొంగుబాటుతో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలిందన్నారు.

- Advertisement -

Also read: AIADMK MLA resigns: అన్నాడీఎంకే టు టీవీకే.. ఆగని వలసలు.. తమిళనాట అసలేం జరుగుతోంది?

అంతా లొంగిపోయారు.. ఇంకా ముగ్గురే ఉన్నారు..!

‘‘పసునూరి నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లా సోమిడి. డిగ్రీ చదువుతున్న సమయంలో మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిపోయారు. 1982లో అజ్ఞాత దళ సభ్యుడిగా చేరారు. 2017లో కేంద్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. తుపాకులు, మోర్టార్లు, రాకెట్లు, గ్రనేడ్ల తయారీలో నరహరికి అనుభవం ఉంది. సాంకేతిక, సంస్థాగత బాధ్యతలను ఏకకాలంలో నిర్వర్తిస్తూనే ఆయుధాల ఉత్పత్తి, మరమ్మతు, నిర్వహణకు సంబంధించి దళ సభ్యులకు ఆయన శిక్షణనిచ్చేవారు. మావోయిస్టు కార్యకలాపాల నిర్మూలనకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే కీలక సభ్యులంతా లొంగిపోయి జన జీవన శ్రవంతిలో కలిసిపోయారు. అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవాలి. తెలంగాణకు చెందిన గణపతి, జాడే సుజాత, వార్త శేఖర్‌ మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం జీవనోపాధి, పునరావాసం కల్పిస్తుంది.’’ అని డీజీపీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News