HomeతెలంగాణRajendranagar: ప్రజల సుఖసంతోషాలే లక్ష్యం.. జగన్మాతను ప్రార్థించిన ఎమ్మెల్యే

Rajendranagar: ప్రజల సుఖసంతోషాలే లక్ష్యం.. జగన్మాతను ప్రార్థించిన ఎమ్మెల్యే

రాజేంద్రనగర్, అక్టోబర్ 15 (తెలుగు ప్రభ): రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని జగన్మాతను ప్రార్థించినట్లు ఎమ్మెల్యే టి. ప్రకాష్‌గౌడ్‌ తెలిపారు. మార్కండేయనగర్‌లో బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్, నవోదయ యూత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో గురువారం రాత్రి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా శ్రీనివాస్ పంతులు మంత్రోచ్చారణల నడుమ శ్రీ లలితా త్రిపురసుందరీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మహా మంగళహారతి సమర్పించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు స్వయంగా వడ్డించారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ మాట్లాడుతూ.. మార్కండేయనగర్ ప్రజలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను సమష్టిగా నిర్వహిస్తూ, భక్తిభావంతో పాటు సామాజిక ఐక్యతను చాటుకోవడం అభినందనీయమన్నారు. శరన్నవరాత్రుల్లో జగన్మాతను వివిధ రూపాల్లో ఆరాధించడం మన సంప్రదాయంలో విశిష్టమైనదని తెలిపారు. అమ్మవారి కృపతో ప్రజలందరికీ శాంతి, సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. పేదలకు అన్నప్రసాదం అందించడం గొప్ప సేవాభావానికి నిదర్శనమని పేర్కొంటూ, ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో బస్తీ పెద్దలు గద్దె కృష్ణ, ఏర్వ సత్యనారాయణ, పగిడిమర్రి సూర్యనారాయణ, విడెం రమేష్, బస్తీ కమిటీ ప్రధాన కార్యదర్శి కోట శ్యామ్‌కుమార్, ఉపాధ్యక్షుడు శిరందాసు నరేందర్, తిరునగ లక్ష్మణ్, నవోదయ యూత్ అధ్యక్షుడు కోట పవన్‌కుమార్, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్. ధనంజయ్, సీనియర్ నాయకులు సరికొండ వెంకటేష్, మామిడిశెట్టి శ్రీనివాస్, బాస శ్రీనివాస్, కళ్లెం లక్ష్మారెడ్డి, మహేష్ గౌడ్, శేఖర్, నవోదయ యూత్ ప్రతినిధులు జి. మల్లేష్, శిరందాసు ప్రభాకర్, కుమ్మరి నరేష్, మూశం నరేష్, చింట్టు రెడ్డి, గంజి విజయ్‌కుమార్, పి. భాస్కర్, బాత్కు లలీప్ యాదవ్, బాలాజీ, గుర్రం వాసు, గంట వెంకట్, మహేష్, రాజు, సాయి కిరణ్, శివతో పాటు మహిళా భక్తులు గద్దె పద్మ, పగిడిమర్రి ఉమాదేవి, గంజి ధనలక్ష్మి, అవ్వారి సావిత్రి, గద్దె భాగ్యరేఖ, ఇతర భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News