HomeTop StoriesMinisters review: నగరంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు.. ఎల్‌నినోపై మంత్రుల సమీక్ష

Ministers review: నగరంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు.. ఎల్‌నినోపై మంత్రుల సమీక్ష

  • భూగర్భ జలాలు తగ్గడంతో ఆందోళనకరంగా మారిన పరిస్థితి
  • భారీగా పెరిగిన ట్యాంకర్ల వినియోగం
  • జీహెచ్ఎంసీ పరిధిలో రోజూ 12వేల ట్యాంకర్లు వినియోగం
  • ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులపై మంత్రులు అజారుద్దీన్, పొన్నం సమీక్ష

హైదరాబాద్ సిటీబ్యూరో (తెలుగుప్రభ): ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నగరంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ప్రస్తుతం భూగర్భ జలాలు తగ్గడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. జలాలు తగ్గిపోతుంటే వాటర్ ట్యాంకర్ల వినియోగం మాత్రం పెరుగుతుంది. ప్రతిరోజు 12 వేల ట్యాంకర్లను నగరవాసులు వినియోగించడం గమనార్హం. భూగర్భ జలాలు తగ్గిపోతున్నందున కొత్తగా బోర్లు వేయడానికి లేదు. కొత్త బోర్లు వేస్తే, దానిప్రభావం ఇతర బోర్లపై పడుంది. ఈ క్రమంలో నగర ప్రజలకు తాగునీరు ఇబ్బందులు లేకుండా తీసుకోవల్సిన చర్యలపై మంత్రులు అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ కలిసి నగరానికి చెందిన ఎమ్మెల్యేలు జుల్ఫికార్ అలీ, కౌసర్ మొహియుద్దీన్, మహ్మద్ ముబీన్, మజీద్ హుస్సేన్, శ్రీ గణేష్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక్ అల, వాటర్ వర్క్స్ ఎండీ అశోక్, వివిధ విభాగాల అధికారులతో ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హైదరాబాద్‌ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, తాగునీటి లభ్యత, భూగర్భ జలాల స్థితి, విద్యుత్ సరఫరా, ప్రజారోగ్య చర్యలు, విపత్తు నిర్వహణ, దోమల నియంత్రణ, నిత్యావసర వస్తువుల నిల్వలు, ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూపొందిస్తున్న జిల్లా కంటింజెన్సీ కార్యాచరణ ప్రణాళికపై అధికారులు సమగ్రంగా చర్చించారు.

- Advertisement -

Also read: Peeram Cheruvu: పీరం చెరువుపై అక్రమాల పంజా.. టౌన్ ప్లానింగ్ తీరు వివాదాస్పదం..!

భూగర్భ జలాలు పెంచుకోవడానికి కార్యాచరణ రూపొందించాలి..

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా ఎల్‌నినోపై సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నగర తాగునీటికి అవసరమైన కృష్ణా, గోదావరి నుంచి వచ్చే నీళ్ళతో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం, ఇప్పటికిప్పుడు నగరానికి వచ్చే ప్రాజెక్టులో ఇబ్బందులు లేనప్పటికీ వాటిని సరైన విధానంలో వినియోగించుకోవాలని అన్నారు. భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా నీటిని ఆదా చేసుకోవాలన్నారు. అలాగే విద్యుత్‌, నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన కోరారు. భూగర్భ జలాలు పెంచుకోవడానికి అవసరమైన కార్యచరణ చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.

Also read: Inspection : మౌలాలిలో మున్సిపల్ కమిషనర్ మెరుపు తనిఖీ.. పచ్చదనం పెంపునకు పక్కా ప్రణాళిక!

గత పదేళ్లలో ఎప్పుడూ లేని సంక్షోభం..

నగరంలో ఇటీవల వర్షాల కోసం మసీద్‌లలో ప్రార్ధనలు చేశారని మంత్రి పొన్నం గుర్తుచేశారు. అదే విధంగా బోనాల సందర్భంగా అన్ని దేవాలయాల్లో వరుణయాగాలు చేయాలని అన్నారు. గత పదేళ్ళలో ఇలాంటి సంక్షోభం లేదని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారని, వర్షాలు కురవడం చాలా కష్టమని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఎల్‌నిలో ప్రభావం పెరుగుతున్న తరుణంలో నగరంలో విద్యుత్ ఎంత ఉత్పత్తి అవుతున్నది, ఎంతమేర ఖర్చు చేస్తున్నామని నివేదికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సాంస్కృతి శాఖ తరపున భూగర్భ జలాల పాయింట్లు పెంచేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలను తవ్వాలని ఆయన ఆదేశించారు. ముందుగా మంత్రుల గృహ సముదాయంలోనే ఇంకుడు గుంతలు తవ్వాలన్నారు. జిల్లా ప్రజలకు ఇబ్బందులు లేకుండా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News