Dowry Issues Tragedy: వరకట్న వేధింపులకు మరో వివాహిత బలైంది. చిన్న విషయానికే గొడవ పెద్దది చేసుకుని భార్యను దారుణంగా చంపడంతో పాటు తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/saap-chairman-ravi-naidu-fires-on-ycp-mega-dsc-jobs/
జిల్లాలోని కొండాపూర్ పరిధిలో అత్తింటివారు బైక్ కొనివ్వలేదన్న కోపంతో భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త. ఆపై తానూ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మారేపల్లి గ్రామానికి చెందిన దాసరి అంజయ్య(25)కు నారాయణఖేడ్‌కి చెందిన యాదమ్మతో 11నెలల కిందట వివాహమైంది. ఈ క్రమంలో ఇటీవల మద్యానికి బానిసైన గత కొన్ని రోజులుగా బైక్ కోసం భార్యను వేధించసాగాడు. అత్తింటి నుంచి తీసుకురావాలని వేధించడం మొదలుపెట్టాడు.
త్వరలోనే బైక్ కొనిస్తామని అత్తామామలు నచ్చజెప్పారు. ఇటీవల మళ్లీ వారి మధ్య బైక్ విషయమై గొడవ జరిగింది. ఈ క్రమంలో తాము కౌలుకి తీసుకుని పనిచేస్తున్న మామిడి తోటలో భార్య మెడకి చున్నీ బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత భయంతో తాను కూడా చెట్టుకి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Also Read: https://teluguprabha.net/top-stories/dk-shivakumar-unanimously-elected-as-karnataka-clp-leader/
ఘటనపై స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బైక్ వివాదం కారణంగా ఒకేసారి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

