కంగ్టి (తెలుగుప్రభ): కంగ్టి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ స్థానిక నాయకుల మధ్య సమన్వయ లోపం మరియు నాయకుల మధ్య అంతర్గత పోరుతో ఎవరికి వారే యమునా తీరు అన్నట్లు తయారైందని అంటున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న కార్యకర్తలకు స్థానిక నాయకులు న్యాయం చేయడం లేదని పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. నిన్న మొన్న పార్టీలోకి వలసలు వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని, పార్టీ కోసం కష్టపడుతున్న వారికి గుర్తించడంలేదని స్థానిక నాయకులపైన జోరుగా చర్చలు జరుగుతున్నాయి నాయకుల అంతర్గత విభేదాలతో పార్టీకి నష్టమే తప్ప ఫలితం లేదని రోజురోజుకు డీలా పడుతుంది.ప్రజలు అనుకుంటున్నారు.
ఎవరి క్యాడర్ వారిదే ఎవరి వాదన వారిదే సమన్వయ లోపంతో కొట్టుమిట్టాలాడుటునట్టు కాంగ్రెస్ క్యాడర్ స్పష్టంగా కనిపిస్తుందని ప్రజల మాట.సమన్వయ పరచడంలో స్థానిక నాయకులు విఫలమవుతునరని పార్టీ కార్యక్రమాలకు ఎవరి సమాచారం ఇవ్వట్లేదని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యకం చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీలో కోల్డ్ వార్ కొనసాగుతుందని పబ్లిక్ టాక్. కంగ్టిలో కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకత్వం లేక కార్యకర్తలు సతమతమవుతున్నారు. పార్టీకి అన్నీ తానై కార్యకర్తలకు వెన్నుముకగా ఉండి ముందుండి నడిపించే నాయకత్వం లేక కాంగ్రెస్ పార్టీ రాను రాను మరింత బలహీనమైన పరిస్థితి పోతుందేమో అని కార్యకర్తలు భయాందోళన చెందుతున్నారు.
కంగ్టి పార్టీ పరిస్థితి ఈ విధంగా ఉన్న అధిష్టానం మాత్రం నిమ్మకు నీరు ఎత్తనట్టుగా ఉంది, కాని కార్యకర్తలు మాత్రం అధిష్టానం పైన నమ్మకం ఉంచుకొని మాకు ముందుండే నాయకుడిని ఎన్నుకొని నడిపించాలని కోరుకుంటున్నారు, పార్టీ పూర్వవైభ్యం మళ్ళీ వస్తుందా లేదా చతికిల పడుతుందా అనే అనుమానాలు అటు ప్రజల్లో ఇటు కార్యకర్తల మెదులుతున్నాయి.
పార్టీ అధికారంలో ఉన్న స్థానిక సంస్థ ఎన్నికల్లో అధికారం కోల్పోయిందనే అందరికీ తెలిసిన విషయమే,రాష్టంలో బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన గ్రామీణ ప్రాంతలో మాత్రమే పట్టును నింపుకుంటుంది. ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలను సమన్వయం పరుచుకుంటూ బిఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు ఒకే తాటిపై ఉన్నామని సంకేతనికి నిదర్శనం కంగ్టి గ్రామ సర్పంచ్ కృష్ణ ముదిరాజ్ పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయం చేసుకుంటూ పార్టీ కి తనవంతు కృషి చేస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తున్న అధికార పార్టీ కంటే కంగ్టిలో ప్రతిపక్ష పార్టీనే బలంగా కనిపిస్తుందని గ్రామప్రజలుమాట్లాడుకుంటున్నారు.కంగ్టిలో ఎలక్షన్ ఏదైనా బిఆర్ఎస్ పార్టీదె అధికారమని చెప్తున్నారు.

