Homeతెలంగాణమెదక్‌Peerlapalli: పీర్లపల్లి కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కేసిరెడ్డి కృష్ణారెడ్డి

Peerlapalli: పీర్లపల్లి కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కేసిరెడ్డి కృష్ణారెడ్డి

సిద్దిపేట(తెలుగుప్రభ): జగదేవపూర్ మండలంలోని పీర్లపల్లి గ్రామ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా కేసిరెడ్డి కృష్ణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కొంపల్లి కరుణాకర్‌ ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్‌ పార్టీ నూతన కమిటీని ఎన్నుకున్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వంటేరు నరేందర్‌రెడ్డి, మండల కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ ఓం ప్రకాశ్‌, ఉపసర్పంచ్‌ మల్లికార్జున్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. నూతన కమిటీ వివరాలు..గ్రామ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా కేసిరెడ్డి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడిగా మాడమైన కనకయ్య, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా శ్రీపతి కొండల్‌, ప్రధాన కార్యదర్శిగా ఎర్ర సాయిలు, కార్యదర్శిగా కుందన వెంకటరాజు, కోశాధికారిగా నూనె కనకయ్య ఎన్నికయ్యారు. గ్రామ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులుగా పి.రామరాజు, కే.కొండల్‌రెడ్డి, అక్బర్‌, చింతకుంట వీరమల్లు, రొయ్యల కనకయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

- Advertisement -

అనంతరం నూతన కమిటీ సభ్యులను మండల అధ్యక్షుడు కరుణాకర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, ఇతర నాయకులు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన గ్రామ అధ్యక్షుడు కేసిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గ్రామ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించి ప్రోత్సహించిన గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, జిల్లా డీసీసీ అధ్యక్షురాలు అంక్షారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వంటేరు నరేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు కరుణాకర్‌, మాజీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌ ఓం ప్రకాశ్‌, మాజీ ఎంపీటీసీ మహేందర్‌రెడ్డి, గ్రామ కాంగ్రెస్‌ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు. కార్యకర్తలకు, ప్రజలకు అండగా నిలుస్తూ వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తలే వెన్నెముక అని పేర్కొంటూ, అందరినీ సమన్వయం చేసుకుంటూ ఐక్యతతో ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్‌ మల్లారెడ్డి, నాయకులు మధుసూదన్‌రెడ్డి, పాపిరెడ్డి, రొయ్యల శీను, గ్రామ సీనియర్‌ నాయకులు, కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News