Mother and Children Suicide: సంగారెడ్డి జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడింది ఓ తల్లి. భర్త తోడు లేక సాకలేననే కారణమో మరే ఇతర కారణాలో ఆమెను ఈ కఠిన నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించాయి.
సంగారెడ్డి జిల్లా కంది మండలం, జూలకల్ గ్రామంలో కన్న తల్లే ఇద్దరు చిన్నారులకు విషమిచ్చిన ఉదంతం చోటుచేసుకుంది. ఆపై ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన మమత(28)కు కుమారుడు మణికంఠ(5), కుమార్తె ప్రళయ(4)గా గుర్తించారు.
కాగా, ఈ ఏడాది జనవరిలో రోడ్డు ప్రమాదంలో మమత భర్త మృతి చెందాడు. దీంతో భర్త మరణాన్ని తట్టుకోలేక మమత ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

