- త్వరగా కోలుకుని తిరిగి విధుల్లోకి రావాలని ఆకాంక్ష
సిద్దిపేట, (తెలుగుప్రభ):కుడి మోకాలి చిప్పకు శస్త్రచికిత్స చేయించుకుని శ్రీకర హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సీనియర్ జర్నలిస్ట్, తెలుగుప్రభ సిద్దిపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అయ్యమ్మగారి సత్యనారాయణ రెడ్డిని రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ బోరెడ్డి అయోధ్యరెడ్డి గురువారం పరామర్శించారు.
వైద్య చికిత్స, ఆరోగ్య పరిస్థితిపై…
ఈ సందర్భంగా ఆసుపత్రికి చేరుకున్న అయోధ్యరెడ్డి.. సత్యనారాయణ రెడ్డిని పలకరించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మోకాలి చిప్పకు నిర్వహించిన శస్త్రచికిత్స వివరాలు, ప్రస్తుతం అందిస్తున్న వైద్య చికిత్స, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
దీర్ఘకాలంగా జర్నలిజం రంగంలో కొనసాగుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న సత్యనారాయణ రెడ్డి త్వరగా కోలుకుని తిరిగి ప్రజాక్షేత్రంలో తన పాత్రికేయ విధులను కొనసాగించాలని ఈ సందర్భంగా అయోధ్యరెడ్డి ఆకాంక్షించారు. అనారోగ్య సమయంలో ఆత్మీయులు, శ్రేయోభిలాషులు పలకరించడం మనోధైర్యాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.ఈ పరామర్శ సందర్భంగా వ్యాపారవేత్త, కాంట్రాక్టర్, సినీ నిర్మాత జిల్లా రమేష్ తదితరులు అయోధ్యరెడ్డి వెంట ఉన్నారు.
Also Read: Dharpally: 100 పడకల ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

