జహీరాబాద్ (తెలుగు ప్రభ): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం సమీపంలోని యూ టర్న్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదం లో ఏడుగురు మృతి చెందారు. కూలీలను తీసుకెళ్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు దుర్మరణం చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.ట్యాంకర్ కర్ణాటక రాష్ట్రం హుమనాబాద్ నుండి జహీరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.మృతులు కర్ణాటక రాష్ట్రం రాజగిరి కి చెందినవారిగా తెలుస్తుంది.
Also Read: పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు

