Homeతెలంగాణమెదక్‌Siddipet: సైకిల్‌పై పర్యటిస్తూ .. పారిశుద్ధ్యంపై కమిషనర్‌ ప్రత్యేక దృష్టి

Siddipet: సైకిల్‌పై పర్యటిస్తూ .. పారిశుద్ధ్యంపై కమిషనర్‌ ప్రత్యేక దృష్టి

సిద్దిపేట(తెలుగుప్రభ): పట్టణ పారిశుద్ధ్య నిర్వహణపై మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం సైకిల్‌పై పట్టణంలోని ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.

- Advertisement -

పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులకు ఆదేశం: పొన్నాల చౌరస్తా నుంచి బీజీఆర్‌ చౌరస్తా, కోమటి చెరువు, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌, నాగదేవత గుడి, ఎల్లమ్మ గుడి, వేములవాడ కమాన్‌, నర్సాపూర్‌ చౌరస్తా, మోడ్రన్‌ బస్టాండ్‌, రంగధాంపల్లి చౌరస్తా మీదుగా పొన్నాల వరకు రింగ్‌ రోడ్డు వెంట కమిషనర్‌ సైకిల్‌పై పర్యటించారు. ఈ సందర్భంగా రింగ్‌ రోడ్డు ఇరువైపులా బహిరంగ ప్రదేశాల్లో పేరుకుపోయిన చెత్త, అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించారు. వెంటనే పారిశుద్ధ్య సిబ్బందితో ఆయా ప్రాంతాల్లో చెత్తను తొలగింపజేసి పరిసరాలను పరిశుభ్రం చేయించారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, చౌరస్తాలు, బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ మున్సిపల్‌ సిబ్బందికి సహకరించాలని కమిషనర్‌ మల్లికార్జున్‌ కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News