- మూడు ఎకరాల మామిడి తోట అగ్నికి ఆహుతి
- మామిడి, జామ, కొబ్బరి చెట్లు, డ్రిప్ పైప్‌లైన్ దగ్ధం.. రూ.10 లక్షల ఆస్తి నష్టం
పుల్కల్, అక్టోబర్ 5 (తెలుగు ప్రభ): సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట గ్రామ శివారులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ రైతుకు చెందిన మూడు ఎకరాల మామిడి తోట మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. అగ్నిప్రమాదంలో మామిడి చెట్లతో పాటు జామ, కొబ్బరి చెట్లు, డ్రిప్ పైప్‌లైన్ కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. కాగా, ముద్దాయిపేట గ్రామానికి చెందిన పశువుల కాపరి సుదర్శన్ ఉద్దేశపూర్వకంగానే తోటకు నిప్పు పెట్టినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

