Medaram Maha Jatara VIPs visited: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క- సారలమ్మ జాతర శుక్రవారం మూడో రోజుకు చేరింది. మేడారానికి లక్షలాది మంది భక్తులు పోటెత్తుతుండటంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. కట్టుదిట్టమైన భద్రత, విస్తృత ఏర్పాట్ల మధ్య జాతర సజావుగా కొనసాగుతోంది.
Also Read: https://teluguprabha.net/telangana-news/medaram-jatara-2026-sammakka-arrival-gadde/
తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ నుంచే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు.. గిరిజన దేవతలు సమ్మక్క, సారలమ్మ దర్శనాలకు పోటెత్తుతున్నారు. క్యూలైన్లు కిటకిటలాడుతున్నా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రత, విస్తృత ఏర్పాట్లు ఏర్పాట్లు చేసింది. ఇక, జంపన్న వాగులో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల రద్దీని అధికారిక యంత్రాంగం సమర్థవంతంగా నిర్వహిస్తుండగా.. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి వైద్య బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి.
ఈ రోజు హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ గారెత్ విన్ ఓవెన్ వనదేవతలను దర్శించుకుని బంగారం తులాభారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఆయనకు అధికారిక స్వాగతం పలికారు. మేడారం మహా జాతర ప్రాముఖ్యతను, భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను వివరించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/mla-kaushik-reddy-insulted-cp/
రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. అంతకుముందుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జువల్ ఓరం పవిత్ర స్థలాన్ని సందర్శించారు. జానపద కళాకారులు వారికి సాంప్రదాయ స్వాగతం పలికారు.

