Friday, March 13, 2026
HomeTop StoriesMedaram: జనసంద్రమైన మేడారం.. 14 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!

Medaram: జనసంద్రమైన మేడారం.. 14 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!

Traffic jam: సమ్మక్క-సారలమ్మల దర్శనం కోసం మేడారంలో భక్తులు పోటెత్తారు. నేటితో మహాజాతర ముగుస్తుండటంతో గద్దెల ప్రాంగణం జనసంద్రమైంది. గద్దెలపై తల్లీకూతుళ్లు కొలువుదీరడంతో దర్శనం కోసం భక్తులు భారీగా మేడారం చేరుకుంటున్నారు. మేడారం నుండి తాడ్వాయి వరకు 14 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 12 గంటల నుండి వేచిచూస్తున్నట్లుగా భక్తులు తెలిపారు.

- Advertisement -

బస్సుల కోసం ఎదురుచూపులు చూస్తున్న భక్తులు: పసరా నుంచి తాడ్వాయి మీదుగా మేడారం చేరుకునే ఆర్టీసీ బస్సులతో పాటు, వీఐపీ వాహనాలు ట్రాఫిక్ జామ్ కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పసరా నుంచి నార్లాపూర్ రూట్‌లో వెళ్లే ప్రైవేటు వాహనాలు సైతం నెమ్మదిగా కదులుతున్నాయి. అయితే మేడారం నుంచి తిరుగు ప్రయాణమయ్యే భక్తులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేక వేలాది మంది భక్తులు మేడారం బస్టాండ్‌లో బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు.

జనసంద్రమైన తల్లుల గద్దెలు: జాతర చివరి అంకం చేరడంతో భక్తుల రాక అధికంగా పెరిగింది. దీంతో సమ్మక్క- సారలమ్మ గద్దెలు కిటకిటలాడుతున్నాయి. దీంతో భక్తులు మెయిన్‌ గేటు బయట నుంచే మొక్కులు చెల్లించుకొని తిరుగు ప్రయాణం అవుతున్నారు. గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెకు చేరిన తర్వాత భక్తుల రాక ఒక్కసారిగా పెరిగింది. లక్షలాదిగా తరలిరావడంతో పార్కింగ్‌ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. మేడారం ప్రాంతంలో ఎటు చూసినా దారులన్నీ కిక్కిరిసి కనిపించాయి.

Also read-Medaram 2026 : నేటితో ముగియనున్న మేడారం జాతర.. సాయంత్రమే వనప్రవేశం!

భక్తుల అసహనం: మేడారంలో ఏర్పాట్లు సరిగాలేవని.. భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పూర్తిగా చేతులెత్తేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 14కిలోమీటర్లు ట్రాఫిక్‌ జామ్‌ అయినా పోలీసులు పట్టించుకోవడంలేదని అన్నారు. ఇదిలా ఉండగా అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే సుమారు 45 లక్షల మందికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ప్రారంభమైంది మొదలు ఇప్పటివరకు మేడారానికి సుమారుగా 1.25 కోట్ల మంది వరకు జనం వచ్చారని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News