HomeతెలంగాణMeeseva: నేటి నుంచి మీసేవ కేంద్రాలు బంద్.. మళ్లీ పునః ప్రారంభం ఎప్పుడంటే?

Meeseva: నేటి నుంచి మీసేవ కేంద్రాలు బంద్.. మళ్లీ పునః ప్రారంభం ఎప్పుడంటే?

MeeSeva: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ (MeeSeva) కేంద్రాలు తమ సర్వీస్‌ను నేటి నుంచి రెండు రోజులు నిలిపివేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి అమలులోకి తెచ్చిన కొత్త సేవా రుసుములను (Service Charges) సిస్టమ్‌లో అప్‌డేట్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది.

- Advertisement -

36 గంటలపాటు సర్వర్‌ డౌన్‌: సాఫ్ట్‌వేర్ ఆధునీకరణ పనుల కారణంగా సుమారు 36 గంటల పాటు సర్వర్లు అందుబాటులో ఉండవు. దీంతో ఆన్‌లైన్ పోర్టల్‌తో పాటు భౌతిక కేంద్రాల్లోను ఎటువంటి లావాదేవీలు జరగవు. ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాలు, జనన-మరణ రిజిస్ట్రేషన్లు, భూమి సంబంధిత పనులు సహా మొత్తం 500కు పైగా ప్రభుత్వ సేవలు నిలిచిపోనున్నాయి.

Also read-Telangana: మీసేవ యూజర్ చార్జీల పెంపు.. నేటి నుంచే అమలు!

పెరగనున్న సేవా రుసుములు: దాదాపు 15 ఏళ్ల తర్వాత మీసేవ నిర్వాహకుల విన్నపాన్ని మన్నిస్తూ ప్రభుత్వం సర్వీస్ ఛార్జీలను సుమారు 50 శాతం వరకు పెంచింది. దీనికి తోడు 18 శాతం జీఎస్టీ (GST) అదనంగా చేరడంతో వినియోగదారులపై మరింత భారం పడనుండి. ఈ కొత్త ధరల చార్టులను డిజిటల్ డేటాబేస్‌లో సవరించేందుకు మరియు కేంద్రాల్లో ప్రదర్శించేందుకు ఈ రెండు రోజుల విరామాన్ని అధికారులు ఉపయోగిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News