Minister Komatireddy: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని నియమించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఎప్పుడూ జనంలో ఉండే మాస్ లీడర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొనియాడారు. ఆయనను మరో ‘పీజేఆర్'(పి. జనార్ధన్ రెడ్డి)తో పోల్చారు. ఎవరైనా ఆపదలో ఉంటే జగ్గారెడ్డి వెంటనే స్పందిస్తారని, సహాయం చేసే గుణం ఆయనకు ఉందని ప్రశంసించారు. జగ్గారెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేస్తే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/veteran-actor-navnindra-behl-passes-away-at-76/
కాగా, ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి పేరును మంత్రి కోమటిరెడ్డి తెరపైకి తీసుకురావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

