Minister Ponnam Prabhakar: రాష్ట్ర విభజన అంశంపై ఇటీవల కొంతమంది నాయకులు చేస్తున్న వ్యాఖ్యల పట్ల బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. విద్వేషాలు రగిలించేలా మాట్లాడటం ఎవరికీ మంచిది కాదని లేఖలో తెలిపారు.
మీ నేతలకు సర్దిచెప్పండి: రాష్ట్ర విభజనపై బీజేపీ, టీడీపీ నేతలతో పాటు జనసేన అధినేత చేస్తున్న వ్యాఖ్యలు సముచితంగా లేవని పొన్నం పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనుచితంగా జరిగిందనే వాదనలు రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలను పెంచేలా ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో చంద్రబాబు చొరవ తీసుకోవాలని కోరారు.
Also read-KCR: వ్యూహాత్మక ఎత్తుగడలకు కేర్ ఆఫ్ కేసీఆర్.. అందుకే రేవంత్ పేరు ఎత్తలేదా?
తేజస్వి వ్యాఖ్యలపై అభ్యంతరం: పార్లమెంటులో విభజనపై ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను పొన్నం తప్పుబట్టారు. ఆ వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించేలా స్పీకర్‌కు లేఖ రాయాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు పంతాలకు పోకుండా.. పరస్పర సహకారంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగడమే తక్షణ అవసరమని లేఖ ద్వారా స్పష్టం చేశారు.

