Seethakka notices to KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీస్ జారీ చేశారు. తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా బీఆర్ఎస్ పార్టీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ ఆరోపించారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలుపై బీఆర్ఎస్ దుష్ప్రచారాలు చేస్తోందని.. సోషల్ మీడియాలో దీనికి కేసీఆర్‌దే బాధ్యత అని స్పష్టం చేశారు.
Also Read: https://teluguprabha.net/top-stories/cm-revanth-reddy-tweets-to-pm-modi-on-delimitation/
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సోమవారం లీగల్ నోటీసు జారీ చేశారు. అంగన్‌వాడీలకు మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియలో అవినీతి జరిగిందంటూ బీఆర్‌ఎస్ నేతలు వారి అధికారిక సోషల్ మీడియా ఖాతా వేదికగా చేసిన ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ పోస్టులు తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆమె నోటీసులో పేర్కొన్నారు.
‘సోషల్ మీడియాలోని ఆ పోస్టులను 48 గంటల్లోగా తొలగించి, కేసీఆర్ నాకు క్షమాపణ చెప్పాలి. సివిల్, క్రిమినల్ చర్యలు ఉంటాయి. అంగన్‌వాడీ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్(టీటీఎస్‌ఎల్) పారదర్శకమైన టెండర్ విధానం ద్వారా నిర్వహించింది. ఈ ప్రక్రియతో నాకు ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదు. ఒక్కో ఫోన్‌ను రూ. 11,650కే కొనుగోలు చేశాం. మార్కెట్ ధర కంటే తక్కువకే లభించాయి.’- అని సీతక్క స్పష్టం చేశారు.

