HomeతెలంగాణD. Sridhar Babu: ప్రజా పాలన అంటేనే.. అభివృద్ధికి చిరునామా..!

D. Sridhar Babu: ప్రజా పాలన అంటేనే.. అభివృద్ధికి చిరునామా..!

  • గత ప్రభుత్వం అప్పులు చేస్తే.. మా ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తున్నాం
  • ఉప్పల్ నియోజకవర్గంలో 76.46 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

ఉప్పల్ (తెలుగు ప్రభ): ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వ పదేళ్ళ పాలనలో అప్పులే చేసిందన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు అప్పులు తీర్చుకుంటూ మరో వైపు అభివృద్ధి పనులను చేపడుతున్నట్టుగా చెప్పారు. ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల పరిధిలోని కాలనీలలో 76.46 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి,వజ్రేష్ యాదవ్ తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు.

- Advertisement -

ఉప్పల్ నియోజకవర్గంలో మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేసిన పనుల వివరాలు

1. 42 లక్షలతో రామంతాపూర్ చిన్న చెరువు సమీపంలోని భజరంగ్ వ్యాయామశాల వద్ద గ్రౌండ్ ఫ్లోర్ విస్తరణ, బోర్‌వెల్ తవ్వకం పనులు.

2. 48 లక్షలతో భజరంగ్ వ్యాయామశాలకు ఆధునిక జిమ్ పరికరాల ఏర్పాటు.

3. 5.80 కోట్లతో ఉప్పల్ భగాయత్ ఫేజ్-1, రోడ్ నెం. 48 నుండి మూసీ నది వరకు వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులు.

4. 3 కోట్లతో ఉప్పల్ భగాయత్ రోడ్ నెం. 55లో వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులు.

5. 5 కోట్లతో భగాయత్ కమాన్ నుండి రోడ్ నెం. 44 వరకు ఎస్‌డబ్ల్యూ డ్రెయిన్ నిర్మాణ పనులు.

6. 5.80 కోట్లతో ఉప్పల్ భగాయత్ రోడ్ నెం. 44 నుండి నాలా వరకు ఎస్‌డబ్ల్యూ డ్రెయిన్ నిర్మాణ పనులు.

7. 5.80కోట్లతో రోడ్ నెం. 22లో ఎస్‌డబ్ల్యూ డ్రెయిన్ నిర్మాణ పనులు.

8. 3 కోట్లతో ఉప్పల్ భగాయత్ ఫేజ్-2 రోడ్ నెం. 6లో ఎస్‌డబ్ల్యూ డ్రెయిన్ నిర్మాణ పనులు.

9. 5.50 కోట్లతో ఉప్పల్ భగాయత్ రోడ్ నెం. 48, 22, 55 మరియు ప్రధాన రహదారిపై ఫుట్‌పాత్‌ల అభివృద్ధి పనులు

10. 4.95 కోట్లతో ఉప్పల్ భగాయత్ లో మల్టీ స్పోర్ట్స్ అరేనా నిర్మాణ పనులు.

11. 1.12 కోట్లతో ఉప్పల్ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్ కాలనీ, గణేష్ నగర్‌లో దెబ్బతిన్న సీసీ రోడ్ల మరమ్మతులు పనులు.

12. 61 లక్షలతో ఉప్పల్ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్ కాలనీలో సీసీ రోడ్ల మరమ్మతు పనులు.

13. 3.20 కోట్లతో ఉప్పల్ ఎక్స్ రోడ్ బస్ స్టాప్‌ను వి.టి. కమాన్ వద్ద ఉప్పల్ బస్ స్టాండ్‌కు తరలించేందుకు అదనపు డ్రైవ్‌వేలు తదితర పనులు.

14. 1.38 కోట్లతో వెంకట్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని బాలకృష్ణ నగర్ ఫేజ్–Iలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు.

15. 1.90 కోట్లతో వెంకట్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని బాలకృష్ణ నగర్ ఫేజ్–II (ప్రధాన రహదారులు)లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు.

16. 1.08 కోట్లతో వెంకట్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని బాలకృష్ణ నగర్ ఫేజ్–II (అంతర్గత రహదారులు)లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు .

17. 1.68 కోట్లతో వెంకట్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని బాలకృష్ణ నగర్ ఫేజ్–IIIలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు .

18. 90.50 లక్షలతో వెంకట్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీ శ్రీకాంత్ నగర్‌లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు.

19. 93.50 లక్షలతో వెంకట్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని రవీందర్ నగర్‌లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు.

20. 1.08 కోట్లతో వెంకట్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని కుర్మా నగర్‌లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు.

21. 25 లక్షలతో వెంకట్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు.

22. 1.37 కోట్లతో వెంకట్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సత్య నగర్‌లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు.

23. 1.98 కోట్లతో వెంకట్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సబేరా కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు.

24. 80 లక్షలతో బీరప్పగడ్డ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో గణేష్ ఆలయం వద్ద రిటైనింగ్ వాల్, స్టీల్ గిర్డర్ వంతెన నిర్మాణ పనులు.

25. బీరప్పగడ్డ డివిజన్ పరిధిలోని గౌడ్స్ శ్మశానవాటికలో 45 లక్షలతో దహన వేదిక, కట్టెల గది, మరుగుదొడ్ల మరమ్మతు పనులు.

26. బీరప్పగడ్డ డివిజన్ పరిధిలోని జహీద్ నగర్‌లో 54 లక్షలతో సీసీ రోడ్ల మరమ్మతు పనులు.

27. బీరప్పగడ్డ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్‌లో 26 లక్షలతో బాబా కిరాణా స్టోర్ నుంచి ప్రమోద్ ప్లాస్టిక్ షాప్ వరకు సీసీ రోడ్డు మరమ్మతు పనులు.

28. బీరప్పగడ్డ డివిజన్ పరిధిలోని విశ్వకర్మ శ్మశానవాటికలో 5 లక్షలతో అభివృద్ధి పనులు.

29. 35 లక్షలతో చిలుకానగర్ డివిజన్ పరిధిలోని బొడ్రాయి ప్రాంతంలో దెబ్బతిన్న సీసీ రోడ్ల మరమ్మతు పనులు.

30. 48 లక్షలతో చిలుకానగర్ డివిజన్ పరిధిలోని న్యూ రామ్‌నగర్ కాలనీలో దెబ్బతిన్న సీసీ రోడ్ల మరమ్మతు పనులు.

31. 30 లక్షలతో చిలుకానగర్ డివిజన్ పరిధిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఎదురుగా ఉన్న వీధిలో వర్షపు నీటి కాలువ (ఎస్ డబ్ల్యూ డ్రెయిన్) పునర్నిర్మాణ పనులు.

32. 70 లక్షలతో కుషాయిగూడ డివిజన్ పరిధిలోని కాప్రా నాలాపై జమ్మిగడ్డ వద్ద ఉన్న పాత ఆర్‌ఆర్ కల్వర్టు స్థానంలో ఆర్‌సీసీ రోడ్ క్రాసింగ్ కల్వర్టు నిర్మాణం, బలోపేతం, విస్తరణ పనులు.

33. 60 లక్షలతో కుషాయిగూడ డివిజన్ పరిధిలోని ద్వారకాపురి వద్ద ఉన్న పాత ఆర్‌ఆర్ కల్వర్టు స్థానంలో ఆర్‌సీసీ రోడ్ క్రాసింగ్ కల్వర్టు నిర్మాణం, బలోపేతం, విస్తరణ పనులు.

34. 45 లక్షలతో కుషాయిగూడ పరిధి వాసవి శివనగర్‌లో అంతర్గత వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు.

35. 1.98 లక్షలతో చర్లపల్లి డివిజన్ పరిధిలోని సిల్వర్ ఓక్ బంగ్లాల అవుట్‌లెట్ నుంచి చిన్న చర్లపల్లి కల్వర్టు వద్ద నాలా వరకు తృతీయ వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులు.

36. 1.98 లక్షలతో చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈసీ నగర్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జెన్ గార్డెన్ పార్కు వరకు తృతీయ వర్షపు నీటి కాలువ పునర్నిర్మాణ పనులు.

37. 47 లక్షలతో చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈసీ నగర్‌లో ప్లాట్ నెం.163 (గణేష్ దేవాలయం) నుంచి రైల్ విహార్ కాలనీ వరకు 450 మి.మీ. వ్యాసం గల ఆర్ సి సి ఎన్ పి 3 పైప్‌లైన్ ఏర్పాటు పనులు.

38. 66 లక్షలతో చర్లపల్లి డివిజన్ పరిధిలోని చర్లపల్లి చెరువు అవుట్‌లెట్ నుంచి సిల్వర్ ఓక్ బంగ్లాల వరకు 600 మి.మీ. వ్యాసం గల ఆర్ సి సి ఎన్ పి 3 పైప్‌లైన్ ఏర్పాటు పనులు.

39. 35 లక్షలతో చర్లపల్లి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్‌లో హెచ్.నెం.2-3-90/47 నుంచి హెచ్.నెం.2-3-89/62 వరకు మరియు అంతర్గత వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు.

40. వంపుగూడ డివిజన్ పరిధిలోని వంపుగూడ నాలా నుంచి వంపుగూడ గ్రామం, సాకేత్ మిథిలా వరకు తృతీయ వర్షపు నీటి కాలువ నిర్మాణం170.00 లక్షలు

41. 2 కోట్లతో కాప్రా డివిజన్ పరిధిలోని డీఎల్‌ఆర్ ఎన్‌క్లేవ్ నుంచి కందిగూడ ఎక్స్ రోడ్డు వరకు తృతీయ వర్షపు నీటి కాలువ పునర్నిర్మాణ పనులు.

42. 1.85 కోట్లతో కాప్రా డివిజన్ పరిధిలోని కల్లు కాంపౌండ్ వద్ద ఉన్న డ్రెయిన్ నుంచి ఎల్లారెడ్డిగూడ ఎక్స్ రోడ్డు వరకు తృతీయ వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులు.

43. 1.38 కోట్లతో కాప్రా డివిజన్ పరిధిలోని ఆర్‌కే ఎన్‌క్లేవ్ వద్ద ఉన్న డ్రెయిన్ నుంచి సీడీఎంఏ కాంపౌండ్ గోడ వరకు తృతీయ వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులు.

44. 1.85 కోట్లతో కాప్రా డివిజన్ పరిధిలోని అశోక్ కాలనీ నాలా నుంచి విజయ హైస్కూల్ వరకు తృతీయ వర్షపు నీటి కాలువ పునర్నిర్మాణ పనులు.

ఈ కార్యక్రమం లో ఉప్పల్ నియోజకవర్గం అన్ని డివిజన్ల అధ్యక్షులు ,మాజీ కార్పొరేటర్లు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News