Minister Tummala comments on maize purchase: దేశంలో మొక్కజొన్నలు కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 లక్షల టన్నుల మక్కలు కొన్నట్లు స్పష్టం చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల మొక్కజొన్న కొనుగోళ్లలో కొంత ఆలస్యం చోటుచేసుకుంది. లారీలు, కూలీలు, డీజిల్ కొరత వల్ల మొక్కజొన్న కొనుగోళ్లలో ఆలస్యం జరిగింది. అయినా, రాష్ట్రంలో గోదాంలు నిండటంతో పొరుగు రాష్ట్రాలకు పంపుతున్నాం. మక్కల కొనుగోలు వల్ల నష్టం వచ్చినా రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. మొక్కజొన్నతో పాటు దేశంలో అత్యధికంగా వరి కొనుగోలు చేసిన రాష్ట్రంగానూ తెలంగాణ నిలిచింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. రైతు సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాం.’’ అని మంత్రి తెలిపారు.
Minister Tummala: తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా మక్కలు కొనడం లేదు.. మంత్రి తుమ్మల స్పష్టం
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

