Uttam Kumar Reddy LPG Shortage Review: రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. గ్యాస్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్యాస్ సరఫరాపై శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/government-lifts-minute-rule-for-class-10-exams/
రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు, సరఫరా పరిస్థితిపై సమీక్షించిన మంత్రి.. ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
‘గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తప్పవు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు కఠినంగా వ్యవహరించాలి. గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్టళ్లకు సరిపడా గ్యాస్ సరఫరా అయ్యేలా అధికారులు చూడాలి. ఎక్కడా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.’ అని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.

