HomeTop StoriesDevadula Project: 2027 చివరి నాటికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి- మంత్రి ఉత్తమ్‌

Devadula Project: 2027 చివరి నాటికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి- మంత్రి ఉత్తమ్‌

Devadula Project Review: 2027 చివరినాటికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతిపై ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లతో మంత్రులు ఉత్తమ్‌, పొన్నం ప్రభాకర్‌, సీతక్క శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/land-rates-in-telangana-soar-in-telangana/

దేవాదుల ప్రాజెక్టు పూర్తయితే 38.16 టీఎంసీలతో తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలకు సాగునీరు లభిస్తుందని మంత్రి ఉత్తమ్‌ పేర్కొన్నారు. 8 జిల్లాలతో పాటు కరీంనగర్ జిల్లాలో 5.57 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టుపై ఇప్పటివరకు రూ. 14,422 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఇప్పటివరకూ 87.70 శాతం పనులు పూర్తయ్యాయని.. మరో రూ. 3,798 కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్‌ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News